Trending News:
40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది.
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు.
విష్ణు చెంప చెళ్లుమనిపిస్తానన్న నిఖిల్ తల్లి.. ఎందుకంటే?
తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకుంది.
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు
గురువారం థియేటర్లో రిలీజైన సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.
యుద్ధంలో రష్యా సైన్యానికి తీవ్ర నష్టం
Notification.
ఢిల్లీ: అగ్ర రాజ్యం అమెరికా నిఘా విభా�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్య...
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార...
సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్...
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్ర�...
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్ర�...
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్�...
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జ�...
Gold Price Today: బంగారం ధరల వరుస తగ్గింపులకు బ్...
వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్య...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ�...
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో ...
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటు...
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్‌ప�...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమె�...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- డింగ్ డాంగ్ 2.0
- గరం గరం వార్తలు
- యూట్యూబ్ స్పెషల్
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ
Published Sat, Jul 22 2023 12:28 PM | Last Updated on Mon, Jul 24 2023 7:05 AM
టైటిల్: ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ , క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ సినిమాటోగ్రఫీ: Hoyte van Hoytema విడుదల తేది: జులై 21
ది బాట్‌మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ , డన్‌కిర్క్, టెనెట్ వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ నోలన్ నుంచి తాజాగా 'ఓపెన్‌హైమర్' చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. ఇది ఒక బయోపిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.
ఓపెన్‌హైమర్ కథేంటంటే.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న యంగ్ ఓపెన్‌హైమర్ (సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా క్రమంగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో అమెరికా అణు బాంబును తయారు చేసే పనిలో ఉంటుంది. అప్పుడు 1945 రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి పరీక్షించాలని 'మాన్‌హాటన్ ప్రాజెక్టు'ను అమెరికా ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న సైంటిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఓపెన్‌హైమర్‌ను (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను భాగస్వామిని చేస్తుంది.
అలా అతను ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్‌గా తన జర్నీ ఎలా మొదలైందో డైరెక్టర్ నోలన్ అద్భుతంగా చూపించాడు. అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? హిరోషిమా-నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? అనేది ఈ కథలో తెలుపుతాడు నోలన్. ఈ దాడి తర్వాత ఓపెన్‌హైమర్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అతనిపై వచ్చిన విమర్శలను ఓపెన్ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎలా ఎదుర్కొంది? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని ఓపెన్‌హైమర్ ఎందుకు వెల్లడించారు? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఇంటర్వెల్ సమయంలో ఒక రొమాన్స్ సీన్‌లో భగవద్గీతను చూపిస్తూ వచ్చే సీన్ కొంతమేరకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని సెన్సార్ ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం.
ఎలా ఉందంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటి వరకు 6 ఆస్కార్ అవార్డులు, 21 సార్లు అస్కార్ నామినేషన్లకు వెళ్లిన టాప్ డైరెక్టర్. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇదొక్కటే కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రేక్షకులకి అంత సులభంగా అర్థం కావు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది. నిడివి ఎక్కువగానే ఉన్నా అతని ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమాలో ఎలాంటి తికమకలు లేకుండా కథను చాలా నీట్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు కాబట్టి అందరికీ కనెక్ట్ కావచ్చు.
సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగానే కథ రన్ అవుతుంది. ప్రజెంట్, పాస్ట్.. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఓపెన్ హైమర్ అణుబాంబు తయారీ టీమ్‌లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా ఆసక్తిగా స్టోరీ నడుస్తుంది. అణుబాంబును తయారు చేసిన తరువాత ట్రయల్ విజయవంతం కావడం, ఆపై మొదటిసారి హిరోషిమా-నాగసాకిపై ప్రయోగించడం.. దాని వల్ల కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తను ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్ హైమర్ మధ్య నడిచే అప్పటి రాజకీయాలే కాకుండా ఆ సమయంలో వారిద్దరి మధ్య వచ్చే సంభాషణల భావోద్వేగాల సీన్లు బాగుంటాయి.
మానవత్వాన్ని ఒక వెపన్‌లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో 'సిల్లియన్ మర్ఫీ' ఎంతో ఎమోషనల్‌గా నటించారు. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్‌పై ఆసక్తితో పాటు అవగాహన ఉన్న వారు ఈ కథకు బాగా రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని కొన్ని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే అణుబాంబు దాడి గురించి ముందే కొంత అవగాహనతో సినిమాకు వెళ్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడిని అంత సమయం పాటు థియేటర్లో కూర్చోబెట్టడం కొంచెం మైనస్. మొదట్లో ఒక గంటపాటు సీన్లన్నీ చాలా నెమ్మదిగా ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారని గ్యారెంటీ లేదు.
ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్ పాత్రలో 'సిలియాన్ మర్ఫీ' పర్‌ఫెక్ట్‌గా నటించాడు. మనం సినిమా చూస్తున్నంత సేపు.. అణుబాంబును తయారు చేసిన వ్యక్తి ఆ సమయంలో ఇంతలా మదనపడ్డాడా..? అని తప్పకుండా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఓపెన్‌హైమర్‌గా సిలియాన్ మర్ఫీనే క్యారీ చేశారు. అతనికి భార్యగా నటించిన ఎమిలీ బ్లంట్ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. తన భర్త తయారు చేసిన బాంబ్ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొంది? భర్తకు సపోర్ట్‌గా నిలిచిన విధానం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌కు సహాయకుడిగా నటించిన రోల్‌లో 'రాబర్ట్ డౌనీ జూనియర్' మెప్పించాడు. అటామిక్ కమిషన్ హెడ్‌గా అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
ప్రధానంగా 'మేట్ డెమన్' ఎయిర్‌ఫోర్స్ జనరల్ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. టెక్నికల్ పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ టైమ్‌లోని సీన్లను ఈ జనరేషన్‌కు రీచ్ అయ్యేవిధంగా చూపించాడు. దీంతో స్క్రీన్‌పై మంచి ప్రజంటేషన్ కనిపిస్తుంది. సినిమాలో ఒకపైపు రియాలిటీని చూపిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియాలిటీని కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. సినిమాలో చాలా మంది రోల్స్ కనిపిస్తూ పోతున్నా.. పర్ఫెక్ట్ కంటిన్యూటీని ఫాలో అయ్యాడు. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను ఎడిట్ చేశారు. నోలన్ సినిమాలో సౌండ్ వర్క్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అణుబాంబు పేలుడు సమయంలో వచ్చే సీన్ మెప్పిస్తుంది.
ఈ సినిమాకు రియల్ బాంబ్ ఉపయోగించామని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు. నోలన్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒకవేళ నార్మల్ ఆడియన్ అయితే స్టోరీ కొంచెం నిడివి ఎక్కువ ఉందని అనిపించక మానదు, అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా కూడా ఉంటాయి. సినిమా అభిమానులకు మాత్రం మంచి అనుభూతి అయితే ఇస్తుంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్ నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్
Add a comment
Related news by category.
- షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్ట...
- ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే &nbs...
- ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా? టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాల...
- అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే? టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్‌డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్‌నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పె...
- Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్ సీరియల్ కిల్లర్‌కు దొరికితే! ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతి...
Related News By Tags
- ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్? ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు ...
- ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్ 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగా...
- మరో ఓటీటీకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కేవలం వారు మాత్రమే చూసే ఛాన్స్! గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామ...
- బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ 2024 విన్నర్స్.. ఆ హిట్ సినిమాదే పైచేయి క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. 77వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అ...
- ఉత్తమ చిత్రంగా నిలిచిన ఆ సినిమా.. ఏకంగా ఐదు అవార్డులు! గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు తయారీ...
విజయవాడ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..7వ అమరావతి బాలోత్సవం (ఫొటోలు)
పిక్చర్ ఫెర్‌ఫెక్ట్.. భర్త, కొడుకులతో నయనతార ఫుల్ హ్యాపీ (ఫొటోలు)
ఇంద్రకీలాద్రి : కనులపండువగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ (ఫోటోలు)
నేనెంతో అదృష్టవంతురాలిని మమ్మా: సానియా మీర్జా బర్త్‌డే స్పెషల్(ఫొటోలు)
దూసుకెళ్తున్న సాక్షి
టీడీపీ నేతలకు మిథున్ రెడ్డి వార్నింగ్..
అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
- Telugu News
- Entertainment
Oppenheimer Review: నోలెన్ తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' రివ్యూ
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది.ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఓపెన్ హైమర్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు.
ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. నోలెన్ తెరకెక్కించే చిత్రాలని ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఆ అనుభూతి పొందాలని ఆయన ఫాన్స్ అనుకుంటున్నారు. నోలెన్ అందించే విజువల్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ మరో స్థాయిలో ఉంటుంది. ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఓపెన్ హైమర్.
అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు. మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. అణుబాంబు పితామహుడిగా రాబర్ట్ ఓపెన్ హైమర్ గుర్తింపు పొందారు. రాబర్ట్ జె ఓపెన్ హైమర్ బయోగ్రఫీ నవల 'అమెరికన్ ప్రొమిథియస్' అనే నవల ఆధారంగా నోలెన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1945లో అమెరికా మెక్సికో ఎడారిలో అమెరికా న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్టు చేపడుతుంది. శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి టెస్ట్ చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. అప్పుడే థీరిటికల్ ఫిజిసిస్ట్, న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా ఎదుగుతుంటారు. ఆ భయంకర ప్రాజెక్ట్ లోకి ఓపెన్ హైమర్ ని అమెరికా అపాయింట్ చేస్తుంది.
ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయిన ఓపెన్ హైమర్ కి అనేక సవాళ్లు ఎదురవుతాయి. శత్రువులు కూడా ఉంటారు. వినాశనానికి కారణం అయ్యే అణుబాంబు తయారీలో ఓపెన్ హైమర్ పాత్ర ఏంటి ? ఓపెన్ హైమర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు ? తొలిసారి అణుబాంబుని టెస్ట్ చేసే సమయంలో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉండేది ? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి.
క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలు గమనిస్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అయితే నోలెన్ గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ అంత అంత కన్ఫ్యూజన్ నేరేషన్ తో ఉండదు. ఈ చిత్రంలో సిల్లియన్ మర్ఫీ.. ఓపెన్ హైమర్ గా ప్రధాన పాత్రలో నటించారు. అతడి నటన సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అతడు పలికించే ప్రతి హావభావం ఓపెన్ హైమర్ ని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఓపెన్ హైమర్ లా ఈ పాత్రలో సన్నగా కనిపించేందుకు సిల్లియన్ మర్ఫీ కొన్ని రోజులు కేవలం ఒకే ఒక్క బాదం పప్పు తిని డైట్ ఫాలో అయ్యాడట. అతడి డెడికేషన్ స్క్రీన్ పై చేతులెత్తి చప్పట్లు కొట్టే విధంగా ఉంటుంది.
కళ్ళతోనే నటిస్తూ ఓపెన్ హైమర్ ఎమోషనల్ మూమెంట్స్ ని అద్భుతంగా పండించాడు. దర్శకుడు నోలెన్ ఆ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరిని మెప్పించే మరో పాత్ర ఐరెన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్. రాబర్ట్ డౌనీ ఈ చిత్రంలో అటామిక్ ఎనేర్జి కమిషన్ చైర్మన్ లూయీస్ ట్రోస్ పాత్రలో నటించారు. ఓపెన్ హైమర్ కి అతడే ఈ చిత్రంలో ప్రధాన శత్రువు.
గొర్రెల కాపరిగా నటించిన మాట్ డామన్ పాత్ర కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. హీరోయిన్లుగా ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్ ఇద్దరూ పర్వాలేదనిపించే విధంగా నటించారు. కాలేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు ఓపెన్ హైమర్ ఎలా ఉండేవాడు.. ఆ తర్వాత సైంటిస్ట్ అయ్యాక అతడి బిహేవియర్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే సన్నివేశాలని నోలన్ కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఇక అణుబాంబుని టెస్ట్ చేసే సమయంలో ఓపెన్ హైమర్ ఎలా మదనపడ్డాడు అని చూపించే సన్నివేశాలలో.. సిల్లియన్ మర్ఫీ బెస్ట్ యాక్టింగ్ బయటకి వస్తుంది. మానవత్వాన్ని ఒక వెపన్ లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో సిల్లియన్ మర్ఫీ ఎంతో ఎమోషనల్ గా నటించారు.
జపాన్ పై అణుబాంబు పేల్చాక ' ఇప్పుడు నేనే చావునయ్యాను.. నేనే ప్రపంచాన్ని నాశనం చేస్తాను' అంటూ ఓపెన్ హైమర్ పాత్రలో మర్ఫీ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇలా ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో ఇన్వాల్వ్ అవుతారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే 3 గంటల నిడివి ఉన్న విభిన్నమైన చిత్రం. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్ పై ఆసక్తి కాస్త అవగాహన ఉన్న వారు రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే కాస్త అవగాహనా ఆసక్తితో వెళ్ళాలి.
టెక్నికల్ గా
వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన కథ కాబట్టి యుద్ధం లాంటి యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ లాంటివి ఏమాత్రం ఆశించవద్దు. ఇది కంప్లీట్ గా ఓపెన్ హైమర్ అటామిక్ బాంబ్ తయారీ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూపించే చిత్రం. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇది నెక్స్ట్ లెవల్ మూవీ. నోలెన్ ఈ చిత్రంపై ఎంతో అధ్యయనం చేసి ఐమాక్స్ స్క్రీన్ కెమెరాతో చిత్రీకరించారు. దీనితో విజువల్ చూస్తూనే సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు.
అలాగే సౌండ్ డిజైన్ అయితే మరో లోకంలోకి తీసుకువెళుతుంది. జస్ట్ వావ్ అనిపించే విధంగా బిజియం సౌండ్ డిజైన్ ఉంటుంది. లుడ్విన్గ్ గోరాన్సన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అటామిక్ బాంబ్ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ దద్దరిల్లే విధంగా ఉంటుంది. పలు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఉంటుందని తప్పకుండా అంచనా వేయొచ్చు.
ఫైనల్ థాట్:
అణుబాంబు పితామహుడు రాబర్ట్ జె ఓపెన్ హైమర్ జీవిత చరిత్రని క్రిస్టఫర్ నోలెన్ అద్భుతమైన అనుభూతి ఇచ్చే విజువల్ వండర్ గా మలిచారు. ఈ తరహా చిత్రాలపై ఆసక్తి ఉన్నవారు థియేటర్స్ లో మిస్ కాకుండా చూడండి. మిగిలిన వారు అది మీ ఛాయిస్.
Latest Videos
RELATED STORIES
కోర్ట్ కు హాజరైన నటి గౌతమి, న్యాయం జరిగేదాకా పోరాడుతా
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
బిగ్ బాస్ నుంచి ఆదిత్య ఔట్.. మెగా చీఫ్ గా నబిల్, కాలర్ ఎగరేసిన మణికంఠ, పృధ్వీకి అన్యాయం..?
బిగ్ బాస్ తెలుగు 8 లో.. వితికా షేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్, ఒంటరిగానా, మరి జంటగానా..?
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్, కాంతారా 2 నుంచి సాలిడ్ అప్ డేట్ నిజమేనా?
Recent Stories
సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి మహేష్ బాబు
అల్లు అర్జున్ డాన్స్ చూసి డబ్బులు ఇచ్చిన దర్శకుడు, ఆఫీస్ లో ఆయన ఫోటో, ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 8 live Updates|Day 76: ఊహించని ఎలిమినేషన్!
`కంగువా` మూవీ మొదటి రోజు కలెక్షన్.. ఎంతొచ్చాయో తెలిస్తే ఆశ్చర్యమే, సూర్య రేంజ్ ఇదేనా?
ప్రేరణ నిజ స్వరూపం బయటపెట్టిన శ్రీపాథ్.. టేస్టీ తేజ కన్నీళ్లకి కరిగిన బిగ్ బాస్, అమ్మరాకతో కోరిక తీరిన వేళ
Recent Videos
అసెంబ్లీలో ఊగిపోయిన దువ్వాడ శ్రీనివాస్
బాల జీవన్ రెడ్డితో MLC జీవన్ రెడ్డి ముచ్చట
బాలయ్య డాకు మహారాజ్‌గా అదిరిపోయే లుక్స్
ఆశీస్సులు అందించిన Deputy CM పవన్ కళ్యాణ్
నాకెవడూ అవకాశాలు ఇవ్వలే | ఎన్టీఆర్, బాలయ్యే ఇన్‌స్పిరేషన్
IMAGES